Site icon NTV Telugu

Seethakka Vs Kavitha: రాహుల్ యాత్ర బస్సు రేవంత్ వాడిందే.. కవితకు సీతక్క కౌంటర్

Seetakka Vs Kavitha

Seetakka Vs Kavitha

Seethakka Vs Kavitha: గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించారని ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సీతక్క మాట్లాడుతూ.. ఎఐసీసీకి పెట్టిన ఖర్చు ప్రభుత్వ ఖర్చు కాదని అన్నారు. అదంతా పార్టీ ఖర్చు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహారాష్ట్ర, పంజాబ్ రైతులకు నిధులు ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించారని సీతక్క తెలిపారు.

Read also: MS Dhoni Bat: ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మ్యాచ్.. ఎంఎస్ ధోనీ బ్యాట్‌పై చర్చ!

కాగా.. మండలిలో ఎమ్మల్సీ కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు. మండలి పై ప్రైవేట్ ఛానల్ లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. ఈ ప్రభుత్వ బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంభందించిన పది శాతం కూడా బడ్జెట్ లో కేటాయించడం లేదని తెలిపారు. ప్రజావాణి వినడం లేదు ఢిల్లీ వాణి వింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు.

Read also: Palakurthi Thikka Reddy: ఏరిగేరి గ్రామ ప్రజలకు అండగా ఉంటాం.. పక్కా ఇళ్లు కట్టిస్తాం..

సోషల్ వెల్ఫేర్ కు మంత్రి లేరని అన్నారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 1.39 లక్షల మంది మహిళలకు 2,500ల మందికి ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు లక్ష, తులం బంగారం ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ లపై స్పష్టత లేదు… ఎప్పుడు అమలు చేస్తారు? అని అన్నారు. గృహజ్యోతి ప్రారంభిస్తాం అంటున్నారు…దాని ఊసే లేదని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పథకానికి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..? అని మండిపడ్డారు. రేపు సేవలాల్ జయంతికి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ కొన్న బస్సులకు జెండాలు ఊపుడు, కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికేట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
We Love Bad Boys : వాలెంటైన్స్ డే స్పెషల్.. ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Exit mobile version