Site icon NTV Telugu

Minister Seethakka : సైదాబాద్‌లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్‌ను సందర్శించిన మంత్రి సీతక్క

Minister Seethakka

Minister Seethakka

సైదాబాద్ లోని స్పెషల్ అబ్జర్వేషన్ హోమ్‌ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇక్కడ 72 మంది విద్యార్థులు ఉన్నారని, ఇక్కడ బాల నేరస్తులుగా వచ్చినవారిలో పరివర్తన తీసుకొస్తున్నామన్నారు. ఇది శిక్ష కాలం కాదు శిక్షణ కాలమని ఆమె వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వ అబ్జర్వేషన్ ఉన్నంతవరకు వాళ్ళలో మంచి పరివర్తన రావాలని, వాళ్లకి కావాల్సిన ఎడ్యుకేషన్, వృత్తిపరమైన కోర్సులను నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. టాటా టెక్నికల్ సపోర్ట్‌తో సాంకేతిక పరిజ్ఞానం నేర్పిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. విలు విద్యలో నేషనల్ గేమ్స్ వరకు రాణిస్తున్నారని, ఇంకా అవకాశాలు కల్పించి యోగ్యులుగా తీర్చిదిద్దుతామన్నారు.

Mahesh Kumar Goud: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వార్నింగ్..

తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఉంటారని, వాళ్లు పరివర్తన తెచ్చేందుకు మహిళ సంక్షేమ శాఖ నుంచి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇక్కడ అవసరాలను సమీక్షించుకొని విద్యార్థుల కోరిన అన్ని వసతులను కల్పిస్తామని, తొందరలో వారిని సత్ప్రవర్తన తీసుకొచ్చి ఇంటికి పంపిస్తామన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రి అనే భరోసా ఇస్తామని, వారి టాలెంట్ను బయటికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారి భవిష్యత్తు చక్కగా ఉండేలా తీర్చిదిద్దామన్నారు మంత్రి సీతక్క.

India-Canada Ties: ఖలిస్తానీ సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్లాన్.. అందుకే భారత్‌తో దౌత్యయుద్ధం..

Exit mobile version