NTV Telugu Site icon

Minister Seethakka: నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలి..

Seethakka

Seethakka

Minister Seethakka: సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరుతో ఈ సోమవారం నుంచి వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

Read Also: CM Revanth Reddy: భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి.. కలెక్టర్లకు సీఎం సూచన

తొలి ఒడి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడి కేంద్రాలే అని మంత్రి తెలిపారు. దుకే పిల్లలకు ఆరోగ్యము, పోషకాహారము, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలన్నారు. మీ పిల్లల భద్రత మా బాధ్యత అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించేలా అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వస్తువులు అందేలా జిల్లా సంక్షేమ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని.. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన అంగన్వాడీ కేంద్రాలు నిలవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని.. అంగన్వాడి చిన్నారులకు మొట్టమొదటి సారిగా యూనిఫాంలు అందజేయబోతున్నామని తెలిపారు. దత్తత ప్రక్రియను కూడా సులభతరం చేశామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.