NTV Telugu Site icon

Minister Seetakka: జాతరకు నెల ముందునుంచే మేడారానికి భక్తులు.. అక్కడే మంత్రి సీతక్క మకాం

Seetakka

Seetakka

Minister Seetakka: వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను సీతక్క – కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు పరిశీలన వేగవంతం చేశారు. అదే ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క.. మేడారంలో తన సత్తా చాటారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగాన్ని నడుపుతూ అమ్మలకు కూడా సేవ చేస్తున్నారు. మేడారం మహాజాతరకు 25 రోజులు మాత్రమే మిగిలి ఉంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈ నెల 31లోగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ ఇచ్చారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అయితే మహాజాతరలో అమర్చిన సీసీ ఫోటేజ్ ను సీతక్క పరిశీలించారు.

Read also: Secunderabad PG Hostel: లేడీస్‌ హాస్టల్‌ లో చొరబడి ఇద్దరు యువకులు.. సికింద్రాబాద్ లో ఘటన

ఈసారి జాతరకు ఆరు రాష్ట్రాల నుంచి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. మేడారం జాతర పనులను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్‌తో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించి సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. కొత్తూరు సమీపంలోని వీఐపీ పార్కింగ్, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నాన ఘాట్లు, స్థూపం రోడ్డు, మరుగుదొడ్లను పరిశీలించారు. కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్‌ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, వసతులు కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోను జాతరలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని కోరారు.
Mamata Banerjee : ‘వారం రోజుల్లో బెంగాల్ నిధులు తిరిగివ్వండి లేదంటే…’ కేంద్రానికి మమత అల్టిమేటం