Site icon NTV Telugu

Minister Seethakka : మెడికల్ కాలేజీలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేశాం

Seethakka

Seethakka

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు మంత్రి సీతక్క. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించామని, గ్రామీణ ప్రాంత బిడ్డలకు సేవ చేయడం వృత్తికి ఇచ్చే గౌరవమన్నారు మంత్రి సీతక్క. మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేసే దశలో ఉన్న వాటికి మేము జీవం పోసామని, మెడికల్ కాలేజీలను సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేశామన్నారు. అంతేకాకుండా.. మారుమూలా అటవీ ప్రాంతాల్లో ఎంత సేవ చేస్తే అంత మంచి పేరు సంపాదించవచ్చు అని, కష్టమైనా ఇష్టంగా మలుచుకొని ట్రైబల్ ఏరియాలో పనిచేయండన్నారు సీతక్క. ముఖ్యంగా వైద్యులు ముందుకు వచ్చి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Malavika Mohanan: ప్రభాస్‌పై మాళవిక ప్రసంసల వర్షం.. ‘రాజాసాబ్‌’ షూటింగ్‌ అప్‌డేట్

Exit mobile version