Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. గత విచారణలో హాజరుకాలేకపోవడంతో కోర్టు NBW (Non-Bailable Warrant) జారీ చేసింది. దీనితో మంత్రి సీతక్క ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రెండు షూరీటీలు ఒక్కొక్కటి రూ.10,000 చొప్పున సమర్పించారు. దీంతో కోర్టు NBWను రీకాల్ చేసింది. 2021లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విస్తరించిన సమయంలో పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను కలపాలని డిమాండ్ చేస్తూ సీతక్క నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అయితే, ఈ నిరసనపై ప్రభుత్వం “కరోనా వ్యాప్తికి కారణమయ్యారు” అనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది.
SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి మూవీపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నేడు కోర్టులో హాజరైన అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పీక్స్ టైమ్‌లో పేదల్ని కాపాడాలని, ఆరోగ్యశ్రీలో చికిత్స కలపాలని డిమాండ్ చేశాం. కానీ, అదే కారణంగా మాపై తిరిగి కేసులు పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లక్షల్లో బిల్లులు వసూలు చేసినా, బడుగుల ప్రజలు ప్రాణాలతో పోరాడినా ప్రభుత్వం స్పందించలేదు. ఇక మేము మాట్లాడితే మాత్రం ఆరోపణలు, కేసులు. ఇది బాధాకరం అని అన్నారు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కోర్టు తీర్పులను గౌరవిస్తాం అంటూ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్ట్ 13కు వాయిదా వేసింది.
Air Asia Flight: గాల్లో ఉండగా ఘర్షణ.. ప్రయాణికుడ్ని చితకబాదిన లేడీ గ్రూప్
