NTV Telugu Site icon

Minister Seethakka : నేను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతాను అనుకోలేదు

Seethakka

Seethakka

హన్మకొండ జిల్లా దొడ్డి కొమురయ్య వర్ధంతి, రణధీర సీతక్క పుస్తక ఆవిష్కరణ పరిచయ వేదిక హన్మకొండ జెడ్పి కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతాను అనుకోలేదన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానని, విప్లవ ఉద్యమం నుంచి ప్రజా సేవకొచ్చానన్నారు. పేదలను అసహ్యహించుకునే వాళ్లు రాజకీయలలో ఎక్కువ ఉంటారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన జరిగితేనే లక్ష్యం నెరవేరినట్టు తెలిపారు. పోరాట ఫలితమే తెలంగాణ సాధ్యం… రాజకీయ నేతలను తప్పులు చేస్తే… మేధావి వర్గం తట్టి చెప్పడానికి ముందుకు రావాలన్నారు మంత్రి సీతక్క. నా పై సినిమా తీయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు… కానీ నేను వద్దు అని చెప్పానని, తుపాకీ గుండునే ఎదుర్కొన్న నేను కరోనా కు భయపడుతమా అనుకున్న… సేవా చేశానని అన్నారు.

అంతేకాకుండా.. ‘రాజకీయంలో పదవులు వస్తాయి పోతాయి… ప్రజలకు సేవ చేస్తే సంతృప్తి కలుగుతుంది… రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తా లేక… వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తున్నారు… నన్ను దెబ్బగొట్టాలని పదే పదే దుష్ ప్రచారం చేస్తున్నారు… అందుకే కెసిఆర్ కు నోటిస్ పంపిన.. రాజ్యాంగం అమలు లోకి వచ్చిన నాటి నుంచి గోండులకు అవకాశం రాలేదు… మంత్రి కాలేదు… నాకు వస్తే బీ ఆర్ ఎస్ వాళ్లు ఓరుస్తలేరు…. ఉద్యమ జీవితం ను కూడా కించపరిచే విధంగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు… కోట్ల ఆఫర్స్ వచ్చిన నేను పార్టీ మారలేదు… వనరులను కైవసం చేసుకోవడానికి పని గట్టుకొని అవస్థవాలు ప్రచారం చేస్తున్నారు… అమెరికా ఆఫ్ పేజీ లోనూ నా గురించి వ్యాసం వచ్చింది…’ అని మంత్రి సీతక్క అన్నారు.