Site icon NTV Telugu

Minister Seediri Appalaraju: అభివృద్ధిపై చర్చించడానికి రెడీ.. నారా లోకేశ్‌కు మంత్రి సీదిరి సవాల్

Seediri Appalaraju

Seediri Appalaraju

Minister Seediri Appalaraju: చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. మహిళల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు‌.. డబ్బు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రధాని మోడీకి లెటర్ రాశారని ఆరోపించారు. ఇప్పుడు అవకాశం ఇస్తే అన్ని ఇస్తానని చెబుతున్నారు.. ప్రజలు నమ్ముతారా? ప్రజలు బాబుని నమ్మాల్సి‌న అవసరం లేదన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాకు, పలాస నియోజకవర్గానికి చంద్రబాబు , నారా లోకేష్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని నారా లోకేష్ చూడాలన్నారు.

Read Also: Daggubati Purandeswari: మరోసారి వైసీపీ టార్గెట్‌ చేసిన పురంధేశ్వరి..

అభివృద్ధి అంటే కళ్లబొల్లి కబుర్లు కాదని ఎద్దేవా చేశారు. ప్రస్ట్రేషన్‌లో ప్రతిపక్షనేతలు పిచ్చి పిచ్చిగా మాటాడుతున్నారని మంత్రి తీవ్రంగా వ్యాఖ్యానించారు. లోకేష్ శ్రీకాకుళం వచ్చి‌ ఏం మాట్లాడతాని ఆయన ‌ప్రశ్నించారు. 14 ఏండ్ల బాబు పాలన‌ , ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్ధమని.. లోకేష్‌తో అభివృద్ధి అంశంపై చర్చించడానికి రెడీ అంటూ సవాల్ విసిరారు. టీడీపీ బహిరంగ సభకు వచ్చి మాట్లాడటానికైనా తాను రెడీ అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

Exit mobile version