NTV Telugu Site icon

Seediri Appala Raju: మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు?

Seediri Appalaraju

Seediri Appalaraju

మంత్రి సీదిరి అప్పల రాజు విపక్ష నేతలపై విరుచుకుపడుతుంటారు. ఏపీ గురించి, జగన్ గురించి ఏం తేడాగా మాట్లాడినా ఆయన ఊరుకోరు. తాజాగా అటు తెలంగాణ, ఇటు టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీ, వైసీపీ సంబంధం ఏంటో అచ్చెన్నాయుడు చెప్తే సమాధానం చెప్తానన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ కి బయ్యారం గనులు ఇమ్మని అడిగితే గతంలో తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించారు. బీ ఆర్ ఎస్ రాష్ట్రంలో ఉనికి కోసం స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటానని హైప్ చేసింది.

Read Also: Tammineni Veerabhadram: పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో కేసీఆర్‌ను కలుస్తా

ఉత్తరాంధ్ర అభివృద్ధి పై అచ్చెన్నాయుడు చర్చ కి రావాలి… నా ఛాలెంజ్ స్వీకరించాలి. ఎంపీ రామ్మోహనాయుడు కూడా మైక్ లు ముందు మాట్లాడేస్తున్నాడు…. నీ బాబాయి నిన్ను క్షేత్ర స్థాయిలోకి వెళ్ళనివ్వడంలేదు అది ఆలోచించు అన్నారు రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క హార్బర్ నిర్మాణం జరగలేదని గతంలో కామెంట్ చేశారు మంత్రి సీదిరి.

కనీసం శంకుస్థాపన అయినా చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారుడాక్టర్ సీదిరి అప్పలరాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుపై సవాల్ విసిరారు.రాష్ట్రంలో 975 కిలోమీటర్ల మేర తీరప్రాంతముందన్నారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నా ఏనాడు హార్బర్ల ఏర్పాటుకు ప్రయత్నించలేదన్నారు.నౌపడా సభలో అచ్చెన్నకు సరైన పోటీ దారుడిని జగన్ దింపారని, ఈసారి ఎలా గెలుస్తావో చూస్తామని వ్యాఖ్యానించారు మంత్రి అప్పలరాజు. మొత్తం సిక్కోలు రాజకీయం రసవత్తరంగా మారింది.

Read Also: Tammineni Veerabhadram: పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో కేసీఆర్‌ను కలుస్తా