NTV Telugu Site icon

Minister Satyavathi: వరద నష్టాలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం

Minister Satyavathi

Minister Satyavathi

మహబూబాబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టంపై అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జెడ్పీ ఛైర్మెన్ బిందు, కలెక్టర్ కే శశాంకలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకు హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు జిల్లా ప్రజల తరపున సీఎం కేసీఆర్ కి మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలియజేశారు. వెనుకబడ్డ మా గిరిజన జిల్లాను అభివృద్ధి చేసిన గొప్ప సీఎం కేసీఆర్ ది అని ఆమె అన్నారు. భారీ వర్గాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి తాత్కాలికంగా 500కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు.

Read Also: Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్

అయితే, వర్షాలు, వరదలపై ప్రతిపక్షాలు విమర్శలు, బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. సంవత్సరంలో కురవ వలిసిన వర్షం గంటల్లో కురవడం మనం కోరుకున్నది కాదని, దీంతో కొంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది అని ఆమె చెప్పుకొచ్చారు. వరదల వల్ల నష్టపోయిన జిల్లాకు సీఎం కేసీఆర్ వెంటనే పునర్నిర్మాణ పనులకు 500 కోట్ల రూపాయలను కేటాయించారు అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు అని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లాకు ఇన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్ కు జిల్లా ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: INDIA MPs: మణిపూర్‌ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్‌ చేయండి.. రాష్ట్రపతికి ఇండియా ఎంపీల విజ్ఞప్తి