Site icon NTV Telugu

Minister Satyakumar: రపా రపా డైలాగ్‌ కాదు.. బాలకృష్ణ, మహేష్ బాబులా చేయండి చూద్దాం..

Minister Satyakumar

Minister Satyakumar

రపా రపా డైలాగ్ పై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రపా రపా భాష వాడటం తప్పన్నారు. తప్పని తెలుసుకోవాల్సిందిపోయి సమర్దించడం కరెక్ట్ కాదని తెలిపారు. సినిమాల్లో చెప్పినప్పుడు బయట చెబితే తప్పేంటంటారని.. సినిమాల్లో చేసేవన్నీ బయట చెప్పాలనుకోవడం తప్పే అని స్పష్టం చేశారు. సినిమాలో బాలకృష్ణ తొడకొడితే 20 సుమోలు గాల్లోకి ఎగురుతాయి. మహేష్ బాబు 20అంతస్థుల బిల్డింగ్ పైనుంచి రైలులోకి దూకుతారు. బయట అలా చేసి చూపించగలరా? అని మంత్రి ప్రశ్నించారు. విషపూరిత వాతావరణంలోకి సమాజాన్ని నెట్టివేస్తున్నాం… మార్పు రావాలని కోరారు.

READ MORE: Pakistan: పాకిస్తాన్ నిజస్వరూపం ఇది.. పహల్గామ్ దాడి ఉగ్రసంస్థకు మద్దతు..

ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి పేర్ని నానిపై ఇటీవల కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పేర్ని నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు.. అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ బియ్యం దొంగ పేర్ని నాని.. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలపై అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Viral Reel: హాస్పిటల్‌లో బెడ్‌పై భర్త.. రీల్ బిజీలో భార్య…

Exit mobile version