Site icon NTV Telugu

Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడం దుర్మార్గం.. అనగాని సత్యప్రసాద్ ఫైర్

Satya Prasad

Satya Prasad

Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. అమరావతి మహిళలను అత్యంత దారుణంగా కించపరచడం నీచాతినీచం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు, ఆయన పేటీఎం బ్యాచ్ కు ఇంత కన్నా మంచి మాటలే రావా. ఇంతలా విషం కక్కుతారా. చివరకు మహిళలను కించపరచడం వైసీపీ చిల్లర బుద్ధికి నిదర్శనం. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిజంగానే దేవతల రాజధాని. రాజధానిని నిర్మించడానికి మేం చాలా రకాలుగా కష్టపడుతున్నాం. కానీ జగన్ బ్యాచ్ ఇలాంటి వాటితో వివాదాలు సృష్టిస్తున్నారు.

Read Also : Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిజమే.. ఎంపీ శ్రీ భరత్ క్లారిటీ

అమరావతి మహిళల ఉసురు కారణంగానే 11 సీట్లకు పడిపోయారు. అమరావతి మహిళలను ఇంకా అవమానిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతియే రాజధాని. మన రాజధాని మనకు ఎప్పటికీ ఉండిపోతుంది. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగదు. చంద్రబాబు హయాంలో కచ్చితంగా రాజధానిని కట్టి చూపిస్తాం. మాకు రాజధాని మహిళల గౌరవం ముఖ్యం. వైసీపీ వాళ్లకు ఇలా అవమానించడమే ముఖ్యం. వారికి ప్రజలు మరింత బుద్ధి చెప్పాలి’ అంటూ ఫైర్ అయ్యారు సత్యప్రసాద్.

Read Also : Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

Exit mobile version