Site icon NTV Telugu

Sabitha Indra Reddy: ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy Review: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రితో పాటు ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ప్రవేశ పరీక్షల కన్వీనర్లు హాజరయ్యారు.

Read Also: Ramappa: రామప్పలో వైభవంగా ప్రారంభమైన ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో లోపాలు లేకుండా చూడాలని, పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల లొకేషన్‌ను గుర్తించడంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వీలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు సంబంధిత ఏర్పాట్లు కూడా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, వారికి జారీ చేసిన హాల్‌టికెట్లపై ఇచ్చిన సూచనలను పక్కాగా పాటించాలని సూచించారు. వచ్చే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Exit mobile version