Site icon NTV Telugu

RK Roja: నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పకుండా పోటీ చేస్తాను..

Roja

Roja

వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్టు రాదని కోంత ది శునకానందంతో చేస్తూన్న ప్రచారం మాత్రమే అని మంత్రి రోజా తెలిపారు. గడప గడపకు మొదలుకోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందు వరుసలో నేనే ఉంటున్నాను అన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకూండా పోటి చేస్తాను.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే సీట్లు లేకుండా రోండేసీ నియోజకవర్గాలలో సర్వే చెయ్యించుకుంటున్నారు.. నేను జగనన్న సైనికురాలుని.. ఆయన మాటే నాకు శిరోధార్యం అంటూ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి సీటు తప్పకుండా వస్తుంది అని ఆమె అన్నారు. తాము మంత్రులం ఒకే నియోజకవర్గంలో ఉండలేం.. కదా, రెండు మూడు చోట్ల ప్రభావితం చేసే స్థితిలో ఉన్నామని రోజా అన్నారు. నగరి నియోజకవర్గానికి చాలా చేసాను అని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆ సీటు విషయంలో గ్యారంటీగా ఆ టికెట్ నాకే వస్తుంది అందులో సందేహం లేదన్నారు.

Read Also: Hanuman Trailer: జై హనుమాన్… పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మ చూపించారు

అయితే, గతంలో టీడీపీలో ఉన్నపుడు 2009లో చంద్రగిరిలో రోజా పోటీ చేసి ఓడినా మంచి స్థాయిలోనే ఓట్లు తెచ్చుకుంది. పైగా చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈసారి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు.. అతడి స్థానంలో తన కుమారుడు మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉండటంతో రోజాకు అక్కడ అడ్జస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు అని టాక్ వినిపిస్తుంది. అయితే, తానను మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ధీమాతో మంత్రి రోజా ఉన్నారు. ఇక, ఇవాళ ఉదయం తిరుమల తిరుపతిలో శ్రీవారిని ఆమె దర్శనం చేసుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆ శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి ప్రసాదం ఇచ్చారు.

Exit mobile version