NTV Telugu Site icon

Minister RK Roja: గాంధీ, అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన..

Minister Roja On Cbn

Minister Roja On Cbn

Minister RK Roja: మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా భూమి – నా దేశం కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. భారత దేశం ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండాలని.. బ్రిటీష్‌ వాళ్ళు చెప్పు చేతల్లో ఎన్నో సంవత్సరాలు బానిసల్లాగా బతికాం.. స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టారు. స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Read Also: Independence Day: సీఎం-గవర్నర్ మధ్య గ్యాప్.. జీవిత ఖైదీలకు షాక్

ఇక, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం వైఎస్‌ జగన్ అడుగులు వేస్తున్నారు.. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన చేస్తున్నారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్‌ సమ సమాజాన్ని నిర్మిస్తున్నారు.. గ్రామ సచివాలయల ద్వారా ప్రజల వద్దకే పాలను తీసుకువచ్చారు.. కులాలకు, మతలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు భారతీయులు. ఇక, 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి ఆర్కే రోజా.