NTV Telugu Site icon

Ponnam Prabhakar: కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి సంచలన వాఖ్యలు..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి.. స్వయంగా కేటీఆరే కార్ రేసింగ్‌కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు.. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని అన్నారు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలని తెలిపారు. అమృత్ పథకం అక్రమాలంటూ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికైన కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. అమృత్ పథకంలో అక్రమాలంటూ ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారు.. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాలపై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు.

Fire At Petrol Pump Station: పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. సిబ్బంది చర్యతో?

అంతకుముందు.. ఖైరతాబాద్ రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రవాణా శాఖలో నూతనంగా నియమించబడిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటిసారి ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ముఖ్యమంత్రి రావడంపై ధన్యవాదాలు చెప్పారు. రవాణా శాఖలో చాల కాలంగా పెండింగ్ లో ఉన్న వాహన సారథిలో ఇప్పటికే 28 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.. మనం కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచనతో అమలు చేస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తేవాలని ముఖ్యమంత్రి అనుమతితో 37 టెస్టింగ్ సెంటర్స్‌కి జీవో తెచ్చుకున్నామని తెలిపారు.

AP Government: గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్.. వారికి సమ్మె కాలానికి వేతనాలు విడుదల

ముఖ్యమంత్రి నేతృత్వంలో వాహన స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.. రోడ్డు ప్రమాదాలలో తెలంగాణలో రోజుకు 20 మంది మరణిస్తున్నారు.. రోడ్డు సేఫ్టీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే విభాగంలో అన్ని స్కూల్‌లలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నూతన అసిస్టెంట్ వెహికిల్ ఇన్స్పెక్టర్‌లు ఇప్పటికే పని చేస్తున్న అధికారులు ఉన్నారు.. అన్ని డిపార్ట్మెంట్‌లకి లోగో ఉంది.. రవాణా శాఖకి ప్రత్యేక లోగో తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ అనుమతితో ఎన్ఫోర్స్మెంట్‌కి ప్రత్యేక వాహనాలు తీసుకొస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. డ్రైవింగ్ లైసెన్స్ ఇతర వాటిలో రూల్స్ ప్రకారం ముందుకు పోతున్నామని మంత్రి పేర్కొన్నారు. రవాణా శాఖను సరిదిద్దడానికి కొత్తగా నియామకం అవుతున్న AMVIలను చెక్ పోస్టులకు కాకుండా.. ఎన్ఫోర్స్‌మెంట్‌లో ఉపయోగించుకొని శాఖ గౌరవాన్ని పెంపొందించాలని మంత్రి కోరారు.