Site icon NTV Telugu

Ponnam Prabhakar: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..

Ponnam

Ponnam

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించబోతున్నారు. ఉదయం 10.30 గంటలకు ముస్తాబాద్ జడ్పిటిసి కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు గంభీరావుపేట్ మండలం కోళ్లమద్ది గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, గంభీరావుపేటలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, మధ్యాహ్నం 1:20 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు.

Read Also: Janhvi Kapoor: స్లీవ్ లెస్ డ్రెస్‌లో అదిరిపోయిన జాన్వీ కపూర్…

అలాగే, మధ్యహ్నాం 1:45 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల దుమాలలో జెడ్పీఎస్ఎస్ కాంపౌండ్ వాల్ నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు రైతు వేదికను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక, మధ్యాహ్నాం 2:15 గంటలకు ఎల్లారెడ్డిపేటలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమానికి హాజరవుతారు.. మధ్యాహ్నాం 2.15 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి ఆర్వీఎస్ గదులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే, సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్లలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, సాయంత్రం 6:30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో లహరి గార్డెన్స్ లో సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. అయితే, జిల్లా అభివృద్దికి కృషి చేస్తాను అని ఇప్పటికే పలుసార్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.. అందులో భాగంగానే నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.

Exit mobile version