Site icon NTV Telugu

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా కేంద్ర ప్రభుత్వం.. మంత్రి హాట్ కామెంట్స్..!

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: హైదరాబాద్‌ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు నిర్వహించిన ధర్నాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాదు.. హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మండిపడ్డారు.

Read Also: Mahesh Kumar Goud: మంత్రి పొంగులేటి పై చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్..!

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తెచ్చేందుకు ప్రయత్నించకుండా బీజేపీ నాయకులు రాజకీయ స్టంట్లు వేయడం సరికాదని విమర్శించారు. నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా కేంద్ర ప్రభుత్వం మారిందని, దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వైఫల్యమే కారణమని తెలిపారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: Love Scam : ప్రేమన్నాడు.. పెళ్లాన్నాడు.. 15 లక్షలు బిల్లేశాడు.. ఇక్కడే అసలు ట్విస్ట్..!

ఎన్నికల ముందు ఈ విధమైన రాజకీయాలు చేయడం కన్నా, కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే మేము కూడా వస్తాం అని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి అందరం కలిసి నిధులు తీసుకురావాలన్న మంత్రి, ఈ విషయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అన్నారు. నగర అభివృద్ధి మా బాధ్యత. రాజకీయాలు దానికి అడ్డుకావద్దు అని హెచ్చరించారు. మొత్తంగా కేంద్రం నుండి నిధులు తీసుకురావడానికి బీజేపీ నాయకులు తమ సొంత నేత కిషన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Exit mobile version