మార్నింగ్ వాక్ లో వాకర్స్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ సాగుతుంది.. ధరణితో పాటు 317 జీవో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 90 వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 90 నెలలు కూడా లేదు.. నాణ్యతా లోపంతో కుంగిపోయింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Read Also: Manickam Tagore: నేడు ఏపీకి కాంగ్రెస్ ఇంఛార్జ్ ఠాకూర్.. వైఎస్ షర్మిల బాధ్యతలపై క్లారిటీ..!
కాళేశ్వరం అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ రంగ అక్రమాలపై కూడా విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం.. బీఆర్ఎస్ నేతలు విచారణ జరపాలని సవాల్ చేశారు.. మేము ఎంక్వైరీ స్టార్ట్ చేయగానే ఎందుకు గాబరా పడుతున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ.. కేసీఆర్ ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. మాజీ ఎంపీ వినోద్ సచ్చిలుడు అయితే అక్రమంగా ఉద్యోగం పొందిన వ్యక్తితో సంబంధం లేకపోతే ఫిర్యాదు ఎందుకు చేయడం లేదు.. బండి సంజయ్ డ్రామా ఆర్టిస్ట్ భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రజలకు కాదు వారి కార్యకర్తలకే అందుబాటులో లేకుండా
జిల్లాకు ఏం చేశారో సంజయ్ చెప్పాలి అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.