NTV Telugu Site icon

Ponnam Prabhakar : కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నాం

Ponnam Prabhakar

Ponnam Prabhakar

తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌తో నిర్వహించిన సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర రవాణా చట్టానికి అనుబంధంగా మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామన్నారు. 1988 కేంద్ర వాహన చట్టానికి.. సుప్రీం కోర్ట్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, రాష్ట్రంలో యాక్సిడెంట్స్ ను తగ్గించడానికి ప్రత్యేక నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగుల్లో అసహనం తొలగించడానికి పెండింగ్ సమస్యలు.. ప్రమోషన్స్ చేపడుతామని, చట్టాన్ని కఠినం చేస్తూనే.. రవాణా శాఖ ఆదాయాన్ని పెంచుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 6916 లైసెన్సులు రద్దు చేశామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకువస్తున్నామని, యాక్సిడెంట్స్ నివారణ.. ఉద్యోగుల ఫిట్నెస్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్ సేఫ్టీ సరిచేస్తూ.. నిబంధనలను కఠినం చేయడానికి ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ స్ట్రిక్ట్ గా పని చేస్తుందని ఆయన తెలిపారు.

Vangalapudi Anita: 8 రోజులుగా కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు… రేపటి నుంచి వరద నష్టంపై అంచనా