Site icon NTV Telugu

Ponnam Prabhakar: “ఆపరేషన్ సింధూర్” విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న మంత్రి!

Ponnam

Ponnam

Ponnam Prabhakar: నేడు ఉదయం పాకిస్తాన్ పై భారత్ చేసిన ‘ఆపరేషన్ సింధూరం’ విజయం కావడంతో దేశమంతటా విజయోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఇక ఈ “ఆపరేషన్ సింధూర్” విజయవంతంపై హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన హర్షం వ్యక్తం చేసారు. భారత్ మాత కి జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ.. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడి కి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టిందని, భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాల పై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా.. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.

Read Also: Operation Sindoor: “ఆపరేషన్ సిందూర్‌”లో బహవల్పూర్, మురిడ్కే దాడులే హైలెట్..

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నాయని, హుస్నాబాద్ లో ప్రజలు కూడా సంబరాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా సైనికులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం.

Exit mobile version