NTV Telugu Site icon

Minister Ponnam Prabhakar: మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడండి.. మంత్రి పొన్నం విజ్ఞప్తి

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.. కుల వృత్తులను రక్షించినట్టు ఉంటుందని చెప్పారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మట్టితో తయారు చేసిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కోరారు. మట్టి చాయ్ కప్పులు అయినా, మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ వాడుతూ కుమ్మర్లకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా అండగా నిలబడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Read Also: Janwada Farm House Case: నేడు విజయ్ మద్దూరిని మరోసారి విచారించనున్న పోలీసులు

Show comments