NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ప్రజలు కొంచెం ఓపిక పట్టండి.. అందరికి ఆరు గ్యారెంటీలు అందిస్తాం..

Ponguleti

Ponguleti

కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరంలో మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, అష్టా ఐశ్వర్యాలతో భగవంతుడు చల్లాగా చూడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారో అదే ప్రభుత్వం వచ్చింది.. ఇందిరమ్మ రాజ్యం వస్తే మనందరి బతుకులు బాగుపడతాయి అని మీరందరు కలలు‌ కని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Read Also: Andhrapradesh: న్యూఇయర్‌ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకి మంచి జరిగే విధంగా ఎన్నికలు అప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. చెప్పిన విధంగానే ఈ ఆరు గ్యారెంటీలను ఎన్ని అవంతరాలు వచ్చిన.. ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారెంటీలను అమలు చేపడతున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అందరు కొంచెం ఓపిక పట్టాండి.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఫలాన్ని మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మాది.. ఈ సందర్భంగా మరోసారి ఎన్టీవీ ప్రేక్షకులకు, ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.