Peddireddy Ramachandra Reddy: నా రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన సీఎంను చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Peddireddy Ramachandra Reddy: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… ‘కుప్పంలో చాలా పెద్ద ఎత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశాం. భక్త కనకదాస జయంతిని ప్రతి ఏటా జరుపుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సారి కుప్పంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేశాం. తిమ్మప్పగా జన్మించి అయన భక్త కనకదాసగా మారారు. అయన జీవితం అందరికీ ఆదర్శం. మన కురభ కులంలో అంత గొప్ప వ్యక్తి పుట్టడం అందరి అదృష్టం. భక్త కనకదాస విగ్రహాలు ఏర్పాటు, ఆవిష్కరణకు అన్ని విధాలా తోడుగా ఉంటాం’ అని అన్నారు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Also Read: Vyooham Movie: వ్యూహం సినిమాను ఆపకపోతే.. సైకో వర్మ కార్యాలయం, ఇంటిని ముట్టడిస్తాం!
‘సీఎం వైఎస్ జగన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కృషి చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారు. నా 45 సంవత్సరాల రాజకీయం జీవితంలోనే పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు’ అని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!