Site icon NTV Telugu

Red Sandalwood: ఎర్ర చందనం ద్వారా మరింత ప్రయోజనం.. ఎక్కడ పట్టుబడినా ఏపీకే..!

Peddireddy Ramachandra Redd

Peddireddy Ramachandra Redd

Red Sandalwood: ఎర్ర చందనంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని మానస సరోవర్ హోటల్ లో ఎర్ర చందనంపై అన్ని రాష్ట్రాలు అటవీ శాఖ పీసీసీఎఫ్‌లతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఎర్ర చందనం పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మార్గదర్శకాలుపై చర్చించారు.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చంద్ర ప్రకాష్ గోయల్‌తోనూ సమావేశం అయ్యారు.. ఎర్ర చందనం సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎర్ర చందనం శేషాచలం అడవుల్లో మాత్రమే ఉందన్నారు.. ఇక, దేశంలో ఎక్కడ ఎర్ర చందనం పట్టుబడిన ఒకే ప్రాంతం ఏపీకి తీసుకు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక నోడల్ ఏజెన్సీ కిందకు తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని.. దీని కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన ఎర్రచందనంలో.. రాష్ట్రాలకు, కస్టమ్స్, డీఆర్ఐ లకు వాటా ఉంటుందని తెలిపారు.. ఎర్ర చందనం ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగా మరింత ప్రయోజనం చేకూరుతుందని.. ఆదాయం లభిస్తుందని వెల్లడించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Guatemala: ఏంది అక్కో.. ఏకంగా అగ్నిపర్వతం మీదనే పిజ్జా వండుకొని తింటున్నావ్..

Exit mobile version