NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం.. రాప్తాడు సభ తర్వాత మరింత ఊపు..!

Minister Peddireddy Ramachandra Reddy

Minister Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన.. అనంతపురంలో మీడియాత మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుంది.. అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నాం అన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తి అవుతాయి.. త్వరలో పల్నాడులో మరో సభ ఉంటుందన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుంది . రాష్ట్రంలో అతి పెద్ద సభగా ఈ సిద్దం సభ నిలుస్తుందన్నారు. ఇక, 2024 ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి.

Read Also: MLA Velagapudi vs MP MVV: ఎంపీ ఎంవీవీకి టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్‌ ఛాలెంజ్..! రెడీయా..?

దెందులూరు సభ చూస్తే కోస్తా ప్రాంతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం తెలుస్తుందన్నారు పెద్దిరెడ్డి.. ప్రభుత్వ పనితీరే పార్టీ విజయానికి దోహదపడుతుందన్న ఆయన.. అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నాం.. ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక పథకాలు సీఎం జగన్ మాకు అందించారని తెలిపారు. టీడీపీ వారు మే ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ఏమి లేదు కాబట్టే తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారన్న ఆయన.. ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తారని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేక పోయారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా ఎప్పుడో వైసీపీలోకి మారిపోయాయి. మిగిలిన వారు కేవలం చంద్రబాబు కోసం పని చేస్తున్నారు అని ఆరోపించారు. రాజ్యసభలో ఒక ఎంపీ కూడా లేకపోవడం టీడీపీకి పెద్ద దెబ్బగా పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.