Site icon NTV Telugu

Minister Peddireddy: అమూల్ చేతికి విజయ డైరీ.. లీటర్‌కు రూ.10 పెరిగే అవకాశం.. రైతులకు మేలు..!

Peddireddy Ramachandrareddy

Peddireddy Ramachandrareddy

Minister Peddireddy: అమూల్ సంస్థకు విజయ డైరీని అప్పగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జులై 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయ డైరీని ప్రారంభిస్తారని తెలిపారు.. చిత్తూరు విజయ డైరీకి రూ.12 కోట్లు బకాయిలు ఉన్నాయి.. వాటిని త్వరలో చెల్లిస్తాం అని ప్రకటించారు. ఇప్పటికే పాడి రైతులకు ఐదు నుంచి పది రూపాయలు పెరిగాయి.. అమూల్ రాకతో చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లా పాడిరైతులకు లీటర్ కు పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని వెల్లడించారు.. ఇక, విద్యుత్ భద్రత వారోత్సవాలను ఏటా నిర్వహిస్తున్నాం.. నాయణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్నాం.. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం.. విద్యుత్ అంతరాయాలు లేకుండా అందిస్తున్నాం.. జూన్ నెలలో కూడా విద్యుత్ వినియోగం పెరిగిందని.. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సిఎం జగన్ ఆదేశాలకు విద్యుత్ అందించామని వెల్లడించారు.

Read Also: Delhi Cabinet: ఢిల్లీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ.. అతిషికి ఫైనాన్స్, ప్లానింగ్, రెవెన్యూ శాఖలు!

కొన్ని రాజకీయ పార్టీలు విద్యుత్ అంతరాయాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎల్లో మీడియా ప్రతిపక్షాలకు వంతు పాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ఆయన.. జూన్ నెలలో 260 మిలియన్ యునిట్లు రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగింది.. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ అందించిన ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్న ఆయన.. షుగర్ ఫ్యాక్టరీ సమర్థవంతంగా నిర్వహించలేనప్పుడు ఆ స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సీఎం హామీ ఇచ్చారని.. సిఎం హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తాం.. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం 32 కోట్ల బకాయిలు త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version