విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్లిన బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడ్డాయన్నారు. వరద బాధితులందరికీ సరిపడా ఆహారం, తాగునీరు, పాలు, బిస్కట్లు, పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.
Maharashtra : ఛత్రపతి శివాజీ విగ్రహం తయారు చేసిన శిల్పి అరెస్ట్
ఇప్పటివరకూ 80 శాతం వరద తగ్గిందని, వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. పారిశుధ్యం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 10 వేల మంది పారిశుధ్య కార్మికులు చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లే పనుల్లో ఉన్నారని, అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్,10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామని ఆయన అన్నారు.
SSC CGL Tier 1: అడ్మిట్ కార్డులను విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్..