NTV Telugu Site icon

Minister Narayana: విజయవాడలో రేపటికి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్లిపోతాయి.. త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే

Narayana

Narayana

విజయవాడలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.. వరదలకు విజయవాడ వాసులు అతలాకుతలం అయ్యారు. కనీవినీ ఎరుగని వరద కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు.. వారం రోజుల పాటు అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై పరిస్థితిని మాములు స్థితికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలు.. తీవ్ర ప్రభావం చూపించాయన్నారు. 10 అడుగుల నీళ్లొచ్చి మొదటి అంతస్తు కూడా మునిగిందని తెలిపారు. బుడమేరు పొంగింది.. గండ్లు పడ్డాయి.. వందేళ్లలో లేని విధంగా వరదలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన విజయవాడ కలెక్టరేట్లో ఉండి మానిటరింగ్ చేసి అధికారులకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు.

iPhone 16: ఐఫోన్ 16 @ ‘మేక్ ఇన్ ఇండియా’.. మనదేశం నుంచే ప్రపంచానికి ఎగుమతి..

చాలా వరకు వరద సహాయక చర్యలు పూర్తయ్యాయని.. రేపటికి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్లిపోయే అవకాశం ఉందని మంత్రి నారాయణ అన్నారు. మరోవైపు.. 7800 మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారని.. విజయవాడలో 3000 మంది సిబ్బంది ఉన్నారు.. మొత్తం 10 వేల మంది సిబ్బంది శానిటేషన్ పనుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆహార సరఫరా కూడా సక్రమంగా జరిగిందని.. కృష్ణా జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఫుడ్ పాకెట్లు వచ్చాయని తెలిపారు. అలాగే.. పాల పాకెట్లు, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ బాగా జరిగిందని అన్నారు. వాటర్ కనెక్షన్లు కూడా ఇచ్చాం.. తాగడానికి మాత్రం ఈనెల 12 తర్వాత నీటిని ఉపయోగించాలని చెప్పారు. వరద నీళ్లు పైప్ లైన్లోకి వెళ్లడం వల్ల అంటువ్యాధులు రావచ్చు.. అందుకే కొన్ని రోజుల తర్వాత నీటిని తాగడం మంచిదని అన్నారు. ప్రతి రోజు సీఎం ఐవీఆర్ఎస్సే కాకుండా డైరెక్టుగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు.

Urination: రాత్రిపూట మూత్రం సమస్య తగ్గాలంటే ఇలా చేయండి!

మరోవైపు.. త్వరలో ఇరిగేషన్ కాలువల సమగ్ర సర్వే చేపడతామని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడ వరదల నేపథ్యంలో కాలువలు, డ్రైన్ల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.. చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరణకు చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించనున్నామని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ఎన్యూమరేషన్ చేస్తున్నాయని అన్నారు. అవసరమైతే మరిన్ని బృందాలను పెట్టి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఇళ్ల వద్ద లేకపోతే వారు తిరిగి వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Show comments