NTV Telugu Site icon

Minister Narayana : ఈ నెల 15న రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం

Narayana

Narayana

రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు, డ్రైన్లల్లో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు మంత్రి నారాయణ. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరుపై మంత్ర్ నారాయణ ఆరా తీశారు. డ్రైన్లల్లో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నామని, రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీములతో సమన్వయం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.

Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌ ఆరంభం.. ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ తగ్గింపు!
ఇదిలా ఉంటే..నిన్న ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఏపీలో వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే దీనిని ఎలా నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో కొనసాగుతున్న నిత్యాన్నదానం తరహాలోనే అన్న క్యాంటీన్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

Stock Market Crash : బూడిదలో పోసిన పన్నీరైన రూ.86వేల కోట్ల అదానీ, అంబానీల సంపద