NTV Telugu Site icon

Nara Lokesh: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిన ఏపీ వర్సిటీలు.. మంత్రి లోకేష్ అసంతృప్తి

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఉన్నత విద్యశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్సులో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకింగ్ కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్-10లో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

Read Also: Andhra Pradesh: వరద బాధితులకు పరిహారం ప్యాకేజీపై ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే కరిక్యులమ్‌లో మార్పులు చేయాలన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్ననెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కంప్యూటర్ సైన్స్, మెకానికల్ వంటి వాటితోపాటు సివిల్స్ శిక్షణ కూడా అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పరిశ్రమ పెద్దలతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.