కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలన్నారు లోకేష్.. దీని ద్వారా రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మరింత అందుబాటులో వైద్యసేవలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
Read Also: Guntur: గుంటూరు టీడీపీలో వర్గ విభేదాలు.. ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు
అంతర్జాతీయ బయోటెక్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో గ్లోబల్ కొలాబరేషన్‌కు సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఏపీని బయో టెక్నాలజీ, జన్యుచికిత్సల ప్రాంతీయ కేంద్రంగా నిలిపేందుకు క్యాన్సర్ వైద్య పరిశోధనలు, అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో బయోటెక్నాలజీలో స్థానిక ఆవిష్కరణలు, అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు, జీన్ థెరపీలో లోకల్ ఇన్నోవేషన్ కోసం బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
Read Also: iPhone: ఐఫోన్‌ల పనితీరుపై యాపిల్‌కి కేంద్రం నోటీసులు..
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్‌లో వివిధ సంస్థలతో వరుసగా సమావేశాలు అయ్యారు మంత్రి నారా లోకేష్. ఈ క్రమంలో.. హెచ్‌సీఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో మరో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా హెచ్‌సిఎల్‌ని విస్తరించండని కోరారు. అలాగే.. టైర్ల తయారీలో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ అపోలో టైర్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ నీరజ్ కన్వర్‌తో కూడా లోకేష్ భేటీ అయ్యారు. ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త టైర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.