NTV Telugu Site icon

Nara Lokesh-Nimmala: రెస్ట్ తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్‌ చేయించాలా?

Lokesh Nimmala

Lokesh Nimmala

ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేస్తానంటే.. సస్పెండ్‌ చేస్తా అని మంత్రి నిమ్మల రామానాయుడును ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్‌ సరదాగా అన్నారు. రెస్ట్ తీసుకుంటారా?.. సభ నుంచి సస్పెండ్‌ చేయించాలా అని నిమ్మలను అడిగారు. అన్నా.. కొంచెం రెస్టు తీసుకోండి అంటూ నిమ్మలకు లోకేశ్ సూచించారు. మంత్రి నిమ్మల అనారోగ్యంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాన్యులా (సెలైన్‌ బాటిల్‌)తోనే ఆయన సభకు వచ్చారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ లాబీలో మినిష్టర్ లోకేశ్‌కి మంత్రి నిమ్మల ఎదురుపడగా.. ఆరోగ్యంపై అరా తీశారు. నిన్నటితో పోలిస్తే.. ఈరోజు ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి నిమ్మల చెప్పారు.

‘అన్నా.. కొంచెం రెస్టు తీసుకోండి. రెస్ట్ తీసుకుంటారా?.. లేదా సభ నుంచి సస్పెండ్‌ చేయించాలా?. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్‌ చేయిస్తా. మీకు నిత్యం కళ్లెదుట పోలవరం ప్రాజెక్ట్.. నాకు ఏమో పాఠశాలల అభివృద్ది కనిపిస్తుంటుంది. మీరు రెస్ట్ తీసుకోకోకుంటే మీకు యాపిల్ వాచ్ కొనిచ్చి.. మీ స్లీపింగ్ టైం వాచ్ చేపిస్తా’ అని మంత్రి నిమ్మల రామానాయుడుతో మినిస్టర్ నారా లోకేశ్‌ సరదాగా అన్నారు. ‘నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యం సహకరించడంతోనే అసెంబ్లీకి వచ్చా’ అని నిమ్మల బదులిచ్చారు. ప్రశాంత నిద్ర వల్లే ఆరోగ్యం కుదుటపడుతుందని నిమ్మలకు లోకేశ్‌ సూచించారు.