ఏపీలో మంత్రులు టీడీపీని టార్గెట్ చేశారు. మానిఫెస్టోని మేము బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చూస్తాం.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ మ్యానిఫెస్టోని అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. ఇప్పటి వరకు 98శాతం హామీలు అమలు చేశాం. తాజాగా కళ్యాణమస్తు, పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చాం. దీని వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపయోగం వుంటుంది. ఏ ఇంటికి వెళ్లినా జగన్ వల్ల మాకు ఎంతో ప్రయోజనం అని చెబుతున్నారు. చంద్రబాబు లాగా మేము మ్యానిఫెస్టోని ఎగ్గొట్టాలని చూడడం లేదన్నారు.
అక్టోబర్ ఒకటి నుండి కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫాలను అమలు చేస్తాం. ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకునే వారికి లక్షా ఇరవై వేలు ఇవ్వబోతున్నాం . ఎస్టీలకు కూడా లక్ష ఇరవై రూపాయలు ఇవ్వబోతున్నాం. బీసీలకు 35 చంద్రబాబు ఇస్తే మేము 50 వేలు ఇస్తున్నాం. వికలాంగులకు లక్షా 50 వేలు ఇస్తున్నాం. జగన్ కు ఈ అణగారిన కుటుంబాల కోసం ఎంతగా పథకాలు అమలు చేస్తున్నాం. చంద్రబాబుకు, జగన్ కి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు మంత్రి నాగార్జున. చంద్రబాబు పథకాలను ఎగ్గొట్టేవాడు.. మేము అందరికీ ఇవ్వాలని తాపత్రయం పడతాం అన్నారు.
పదవులు పంపిణీ దగ్గర నుండి పథకాల అమలు వరకు బడుగులకు ఎంతో చేస్తున్నారు జగన్. ఈ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు బూతులు తిడుతున్నాడు. రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయాడు. చంద్రబాబు చేసే కుయుక్తులు, మోసాలు, కుట్రలను అన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. దుష్టచతుష్టయాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. దళితుల మీద దాడులు, వారికి అందే సంక్షేమ పథకాలపై మేము చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు మంత్రి నాగార్జున. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న వ్యక్తి జగన్ అన్నారు.
ఎస్సీల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి. అలాంటి చంద్రబాబు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అన్న క్యాంటీన్లు మేము అడ్డుకోవడం లేదు. అసలు అన్న ఎక్కడున్నాడు? క్యాంటీన్లు ఎక్కడ పెడుతున్నారు? అమరావతిలో రైతులు ఉన్నారా? దళితులు, బీసీలు ఉన్నారా? మరి ఎవరు పాదయాత్ర చేస్తున్నారో జనానికి తెలుసునన్నారు మంత్రి నాగార్జున.
Read Also: Nandamuri Balakrishna: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది