పిఠాపురం 18 వ వార్డులో రేషన్ షాప్ ద్వారా రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తామన్నారు. దురుద్దేశంతో రేషన్ షాప్ లను గత ప్రభుత్వం రద్దు చేసింది. 29796 రేషన్ షాప్ ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది.. 9260 ఎండీయు వాహనాలు కోసం 1700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
Also Read:Tragedy : భర్తపై మరిగే నూనె పోసిన భార్య..
రేషన్ షాప్ లలో రాబోయే రోజుల్లో సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 65 ఏళ్ళు నిండిన వృద్దులకి, దివ్యాంగులకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎండియూ వాహనాలతో మోసం చేసిందన్నారు. ఎవరైనా ఇంటికి వెళ్లి రేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.. రేషన్ షాపులను రేషన్ మాల్స్ గా మారుస్తాం.. 15 రోజులపాటు తమకు నచ్చిన సమయంలో వినియోగదారులు రేషన్ తీసుకోవచ్చు.. అవసరమైతే రేషన్ షాపులను అప్డేట్ చేస్తామని తెలిపారు.
