Site icon NTV Telugu

Smart Ration Cards: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. రేషన్‌ పంపిణీపై ఉన్నతస్థాయిలో మానిటరింగ్

Smart Ration Cards

Smart Ration Cards

Smart Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. వరలక్ష్మి నగర్‌లో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్‌,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కలెక్టర్‌ లక్ష్మీషా.. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ జరుగుతుందన్నారు.. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చాం.. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు..

Read Also: Lokah Chapter 1 Chandra: కల్యాణి, నస్లేన్‌.. ‘లోకా’ ట్రైలర్ చూశారా..

ఎన్టీఆర్ జిల్లాలో 5.70 లక్షల మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు విడతల్లో 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఇవాళ్టి నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది.. బియ్యం, షుగర్ తో పాటు కందిపప్పు, పామాయల్ అవసరాన్ని బట్టి గోధుమలు ఇస్తాం అన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 29,797 వేల రేషన్ డిపో లు ఉన్నాయి.. ఈ డిపోల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు. గిరిజన, కొండ ప్రాంతాల్లో సబ్ డిపోలు ఏర్పాటు చేస్తాం అని వివరించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

Exit mobile version