NTV Telugu Site icon

Merugu Nagarjuna: ఏపీ ధృవతార జగన్.. ఆయన ఎదుగుదలని ఏ శక్తి ఆపలేదు..

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ.. మరోవైపు.. విపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులు జరిగాయని టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మూకమ్మడి దాడులు జరిగాయన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో చిన్న చిన్న దాడులు అక్కడక్కడా జరిగాయి తప్పితే.. పెద్ద ఇష్యూ ఏదీ లేదన్నారు.. ఇక, వైశ్యులకి సీఎం వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారని తెలిపారు నాగార్జున.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పై ఎనలేని గౌరవం ఉందన్నారు.. గౌరవం ఉంది కాబట్టే ఆయన పుట్టిన ఊరిలో విగ్రహం పెట్టామని వెల్లడించారు..

Read Also: Monsoon Tips : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు..!

ఆంధ్రప్రదేశ్ లో ధృవతార సీఎం వైఎస్‌ జగన్‌.. ఏ శక్తి ఆయన్ని ఆపలేదు.. ఎన్ని శక్తులు కలిసినా సీఎం జగన్‌ జగన్ ఎదుగుదలని ఆపలేరు అని పేర్కొన్నారు మంత్రి నాగార్జున.. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసేది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర అంటూ సెటైర్లు వేశారు.. దుమ్ము, ధైర్యం ఉంటే ఎవరైనా.. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి గెలవాలంటూ.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు బహిరంగ సవాల్‌ విసిరారు మంత్రి మేరుగ నాగార్జున. కాగా, వారాహి యాత్రలో పవన్‌ చేస్తున్న కామెంట్లకు మంత్రులు, అధికార పార్టీ నేతలు అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇస్తున్న విషయం విదితమే.. తాజాగా, అమ్మ ఒడి నిధులను విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ను టార్గెట్‌ చేశారు సీఎం జగన్‌.. ఇప్పుడు ప్యాకేజీ స్టార్‌.. ఓ లారీ ఎక్కాడు.. దారి పేరు వారాహి అట.. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు.. తాట తీస్తానంటాడు.. గుడ్డలూడదీసి తంతాను అంటాడు.. ఈ మనిషి నోటికి అదుపులేదు.. ఈ మనిషికి నిలకడా లేదు అని ఎద్దేవా చేశారు.. వారిలా ఊగుతూ మనం మాట్లాడలేం.. వారిలా మనం రౌడీల్లా మీసాలు మెలేయలేం.. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం.. బూతులు మాట్లాడలేం.. వారిలా నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థలను నాశనం చేయలేం.. రోడ్డుపైకి తీసుకురాలేం.. వారిలా అలాంటి పనులు మనం చేయలేం.. అవన్నీ వారికే పేటెంట్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌పై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.