Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.. అయితే, దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
ఇక, మీడియాతో మాట్లాడిన ఎంపీ నందిగం సురేష్.. 2017 లో MRPS నేతలు, కార్యకర్తలపై గత ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసులు వల్ల చాలా మంది చదువు కున్న వారు ఇబ్బంది పడుతున్నారు.. వారి ఇబ్బందుల పై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. వీలైనంత త్వరగా కేసులు తీసేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారు.. ఎప్పుడూ దళితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏ నాయకుడు దళితుల సమస్యలు పట్టించుకోలేదు. దళితుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అన్న మాత్రమే అన్నారు ఎంపీ.. సీఎం ఢిల్లీ పర్యటనలో విభజన హామీల గురించి చర్చించారని కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఎంపీ నందిగం సురేష్.