Site icon NTV Telugu

Merugu Nagarjuna: సామాజిక విప్లవానికి నిదర్శనమే అంబేద్కర్ విగ్రహం..!

Minister Merugu Nagarjuna

Minister Merugu Nagarjuna

Merugu Nagarjuna: సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వెల్లడించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర చెప్పే స్టూడియో, మినీ థియేటర్ కూడా ఇందులో ఉంటాయి.. బౌద్ధ మతాన్ని అంబేద్కరం స్వీకరించిన నాటి వివరాలు ఈ స్మృతివనంలో ఉంటాయని వివరించారు. అంబేద్కర్ భావజాలాన్ని సీఎం వైఎస్‌ జగన్ పరిపాలనా తీరులో చూడవచ్చు అన్నారు. ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్నిరకాల సహకారం అందిస్తున్నారు సీఎం జగన్ అని కొనియాడారు.. వేల కోట్లు ఇచ్చినా ఇలాంటి స్ధలం నిర్మాణానికి దొరకదు అన్నారు.

Read Also: Uttar Pradesh: యూపీలో మసీదులపై నుంచి లౌడ్ స్పీకర్లు తొలగింపు..

మరోవైపు, నారా లోకేష్‌ ఎవరు? ఎమ్మెల్యేనా..? అని ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున.. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి లోకేష్, అతని కుటుంబం పనికిరావన్నారు. ముళ్లపొదల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చూసి దళితులను అపహాస్యం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగులుతారని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. కాగా, రూ.400 కోట్లతో విజయవాడలోని స్వర్జ్య మైదాన్ (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతి వనం (స్మారక ఉద్యానవనం) నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంతో ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడిన విషయం విదితమే.. 81 అడుగుల పీఠంపై 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే, విగ్రహానికి సంబంధించిన పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది, 18.81 ఎకరాల మైదానంలో వచ్చే సంప్రదాయ మందిరం, ధ్యాన మందిరంతో కూడిన మెమోరియల్ పార్కు పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో.. మరోసారి వాయిదా వేశారు. ఇక, మొదట, ప్రాజెక్ట్‌ను 2022 ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి) ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తర్వాత గడువు ఏప్రిల్ 14, 2023కి సవరించబడింది. తరువాత, విగ్రహం కోసం గడువు జూన్ 15కి మరియు జూలై 15కి మార్చబడింది… చివరకు నవంబర్‌ 26వ తేదీకి మార్చినా.. పనులు పూర్తికాకపోవడంతో.. నాలుగోసారి వాయిదాపడినట్టు అయ్యింది.

Exit mobile version