Site icon NTV Telugu

Minister Malla Reddy : చావంచు వరకు పోయి తెలంగాణ తెచ్చిన దేవుడు సీఎం కేసీఆర్

Mallareddy

Mallareddy

కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, మేడ్చల్ నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసింది ముఖ్యమంత్రి ఘనత అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు తెలంగాణ ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడమే కాకుండా జాతీయస్థాయిలను స్ఫూర్తిదాయక నాయకునిగా నిరూపించుకున్నాడని మల్లారెడ్డి కొనియాడారు. వచ్చేది కారు ఏలేది కారు అదే మన కేసీఆర్ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని మల్లారెడ్డి అన్నారు.

Also Read : Family Star: పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా అంటున్న దేవరకొండ

చావంచు వరకు పోయి తెలంగాణ తెచ్చిన దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, జోహార్ నగర్ పేదలకు 40 వేల పట్టాలి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కేదక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాం అని, బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీములని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. లంబాడి సోదరులకు పట్టాలి ఇవ్వాలని, శామీర్‌పేట చెరువును కూడా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలన్నారు మల్లారెడ్డి. ప్రతి గ్రామంలో రోడ్లు సంఘాలు దేవాలయాలు, చర్చిలు, మస్జీద్ లు అన్ని అభివృద్ధి చేశానని, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్నారన్నారు మల్లారెడ్డి. పీసీసీ పదవిని డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడని, రేవంత్ రెడ్డి సీట్లను అమ్ముకుంటున్నాడని మల్లారెడ్డి ఆరోపించారు.

Also Read : YV Subbareddy: 2014 నుంచి 2019 వరకు దోపిడి ప్రభుత్వం నడిచింది..

Exit mobile version