Site icon NTV Telugu

కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి మల్లారెడ్డి

ఢిల్లీ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కలిశారు. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ కు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి మల్లారెడ్డి. నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, సహకారం అందించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు విజ్ఞప్తి చేశారు.

“కరోనా” సమయంలో 17 లక్షల మంది ఈఎస్ఐ లబ్దిదారులకు ఇబ్బంది కలిగిందని… రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలో ఉన్న సనత్ నగర్ హాస్పటల్ ను కార్పోరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ఈఎస్ఐ కార్పోరేషన్ కు అప్పగించగా… దానికి ప్రతిగా నాచారం హాస్పటల్ ఇచ్చారని భూపేంద్ర యాదవ్ కు తెలిపారు మంత్రి మల్లారెడ్డి. ఈ హాస్పటల్ కు అనుబంధంగా ఏర్పాటు చేయదలచిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు, సహకారం అందించాలని కోరిన మంత్రి… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 140 కోట్ల పెండింగు నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version