Site icon NTV Telugu

Minister Lokesh: రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం..

Lokesh

Lokesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టిసారించింది. ఓ వైపు ప్రభుత్వ శాఖల్లోని జాబ్స్ ను భర్తీచేస్తూనే మరోవైపు పరశ్రమలను, పెట్టుబడులను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం భేటి అయింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. ఉద్యోగాల కల్పనలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Also Read:ATM Withdraw: ఏటీఎం వాడేవారికి షాక్.. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు!

ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలి. ఉద్యోగాల కల్పనకు ప్రతి పాలసీలో సంస్కరణలు ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. 5 లక్షల కు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు.. వివిధ పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకు రావడంలో అందరం కలిసి పని చేయాలని మంత్రి లోకేష్ సూచించారు.

Exit mobile version