NTV Telugu Site icon

Minister KTR: నేడు జగిత్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన

Ktr

Ktr

నేడు జగిత్యాలలో ఐటీ& పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జగిత్యాల పట్టణంలో 322.90 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 8:50 గంటలకు మంత్రి కేటీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలు దేరి 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం హెలిపాడ్ దగ్గర 9:45 నిమిషాలకు చేరుకుంటారు.. ఉదయం 10 గంటలకు మొదట జిల్లా కేంద్రంలో నూతనంగా 38 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

Read Also: Yashasvi Jaiswal Fifty: నేపాల్‌తో మ్యాచ్‌.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్‌!

ఆ తర్వాత.. నూకపల్లిలో 280 కోట్ల రూపాయలతో నిరుపేదల కోసం నిర్మించిన 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మొదటి విడతలో భాగంగా 3722 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ అందజేయనున్నారు. అనంతరం బీట్ బజార్ లో నూతనంగా 4కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన వెజ్& నాన్ వెజ్ ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఇక, 11:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం తిరిగి హెలికాప్టర్ ద్వారా ఆయన ధర్మపురికి బయలుదేరుతారు.