NTV Telugu Site icon

Minister KTR : హైదరాబాద్ ఇంట్నేషనల్ సిటీ

Ktr

Ktr

హైదరాబాద్ ఇంట్నేషనల్ సిటీ అని, రజనీకాంత్ ప్రపంచం అంతా తిరిగారు…హైదరాబాద్ ను చూసి న్యూయార్క్ లా ఉంది అనడం మామూలు విషయం కాదన్నారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ ఆయన టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. వరంగల్ ,కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, బెల్లంపల్లిలలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 15 న సిద్దిపేటలో, ఆ తర్వాత నిజామాబాద్, నల్గొండలో ఐటీ హబ్ లు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ 56 వేల కోట్లు ఉంటే.. 2022 – 2023 లో 2 లక్షల 41 వేల 275 కోట్లు అని ఆయన పేర్కొన్నారు.

Also Read : Business: ఫ్రాంచైజీ పద్ధతి ద్వారా వ్యాపారం చేయాలనుకుంటున్నారా.? జాగ్రత్త మరీ.. లేదంటే మోసపోతారు..!

అంతేకాకుండా.. 2022 – 2023 లో ఐటీ రంగంలో కొత్తగా ఉద్యోగాలు 1,26,894 ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల సంఖ్య 9 లక్షల 5 వేల,715 అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారని ఆయన అన్నారు. అయినా ఈ రోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగామని, హైదరాబాద్ ఐటీ రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసినా.. ఈ ప్రగతి సాధ్యమయ్యేలా చూడగలిగామని ఆయన అన్నారు.

Also Read : Sugarcane Juice: చెరుకురసం తాగుతున్నారా? అయితే అస్సలు విడిచిపెట్టొద్దు!