NTV Telugu Site icon

Minister KTR: నేడు కామారెడ్డి, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో

Minister Ktr

Minister Ktr

Minister KTR: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ వ్యూహాలతో మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోగా.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ విజయవంతానికి పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌తో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారాలు చేశారు. దీంతో పాటు ఈరోజు పెద్ద పెద్ద నేతలంతా తెలంగాణలో పెద్ద ఎత్తున పర్యటించనున్నారు. నేడు కామారెడ్డి, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అనంతరం రోడ్ షో నిర్వహించనున్నారు.

Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు ఈ జిల్లాల్లో వానలు

సీఎం కేసీఆర్ గజ్వేల్‌, వరంగల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ కు రానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల నుంచి జన్ ఆశీర్వాద సభలో పాల్గొంటారు. వరంగల్ ఈస్ట్ వెస్ట్ అభ్యర్థుల ప్రచార సభలో పాల్గొననున్నారు. నూతనంగా నిర్మిస్తునన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాల వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో ఎల్‌బీ కళాశాలకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎంసీలోని మీటింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని సభలో మాట్లాడతారు. అనంతరం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గత ఎన్నికల సమయంలో గజ్వేల్‌లో సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈసారి కూడా అదే ఏర్పాటును కొనసాగించనున్నారు.

కాగా.. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 106 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రచార పర్వం ముగియగానే స్థానికేతర నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గురువారం జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
Telangana Election 2023: రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు.. రోడ్ షోలు.. వివరాలు ఇవే..