NTV Telugu Site icon

KTR: మంత్రి నోట ఆసక్తికరమైన మాట.. మోడీ దేవుడు ఎందుకయ్యాడు ?

ktr

New Project (25)

KTR: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి జిల్లా మీద ప్రేమ ఉంటే వెంటనే తీర్మానించాలని డిమాండ్ చేశారు. నారాయణ పేట స్టేడియం గ్రౌండ్ లో ప్రగతి నివేదన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీని ఈ విషయం గురించి నిలదీయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు ఛాలెంజ్ విసిరారు. మోడీ ఎందుకు దేవుడు.. ఎవరికి దేవుడు..70 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుకు దేవుడయ్యాడా మోడీ అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర గ్రామాల పంచాయతీ తేల్చలేక పోతున్నాడు…ఉక్రెయిన్ యుద్ధం ఆపాడు అంట మోడీ అన్నారు. రెండు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర పంచాయతీ తేల్చలేక పోతున్నారు.. మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. దేశంలో తెలంగాణ తప్ప అంతటా రైతుల కష్టాలు, ఖర్చులు డబుల్ అయ్యాయి.. బీజేపీ అధ్యక్షుడు 24గంటల పవర్ వస్తలేదు అన్నాడు…తెలంగాణ లో ఏ గ్రామానికైనా వెళ్లి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల కి ఇన్ కం టాక్స్ వేయాలని ప్రధాని ఆర్థిక సలహాదారు అంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. 100 లక్షల కోట్ల రూపాయల అప్పును ప్రధాని నరేంద్ర మోడీ చేశాడు. తోలు తీసి టోల్ వసూలు చేస్తున్నారు… జాతీయ రహదారులు కడుతున్నామని చెప్తున్నారు..12 లక్షల కోట్లు కార్పొరేట్ లకు మాఫీ చేశారు. ఇది నిజం కాకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ…మహబూబ్ నగర్ లో ఉన్న బీజేపీ నాయకులకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

Read Also: Rain of Money : బెంగుళూరు రోడ్లపై డబ్బుల వర్షం

అంతే కాకుండా నారాయణపేట నియోజక వర్గంలో అభివృద్ధి పనుల గురించి మంత్రి వివరించారు. రూ.196 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. నారాయణ పేట ఇంటిగ్రేటెడ్ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. కొండారెడ్డి పల్లి మినీ ట్యాంక్ బండ్ చాలా అందంగా తీర్చిదిద్దారు.. ఒకప్పుడు అక్కడికి పోవడానికి దారి కూడా లేదు.. సీనియర్ సిటిజెన్ పార్క్ ప్రారంభించుకున్నామని కేటీఆర్ అన్నారు. నారాయణ పేట అభివృద్ధి మీదనే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆలోచనా అంత…మరికల్లో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయం సముదాయం నిర్మించుకుంటున్నాం.. కృష్ణ జలాల్లో మా నీటి వాటా తేల్చండి..మహబూబ్ నగర్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. అక్కడ ఏదేదో సొల్లు మాట్లాడుతున్నారు..రాష్ట్రం ఏర్పడి తొమ్మిదవ సంవత్సరం లో అడుగు పెడుతున్నాం. బీజేపీనాయకులను డిమాండ్ చేస్తున్నాం…విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు మంత్రి కేటీఆర్. కృష్ణ నీళ్ల వాటా తేల్చడానికి ప్రధానికి సమయం దొరకడం లేదు.. పాలమూరు ఎండుతూనే ఉండాలి… కడుపు మండి అధికార పార్టీ మీద తిరగబడతారు అని కేంద్రం వేచి చూస్తుంది.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ బీజేపీ అపుతున్నాయి.

Read Also: Prabhas: ప్రభాస్, హృతిక్ కాంబో కన్ఫమ్.. కానీ ఓ చిన్న మెలిక?

Show comments