NTV Telugu Site icon

MInister KTR : కాంగ్రెస్ వచ్చేది లేదు… సచ్చెది లేదు..

Minister Ktr

Minister Ktr

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చెది లేదు.. వాళ్లకు బాధ్యత లేదన.. కానీ 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అంటారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Chandrayaan-3: విజయవంతంగా విడిపోయిన విక్రమ్ ల్యాండర్.. ప్రపంచం దృష్టంతా ల్యాండింగ్‌పైనే

బీఆర్ఎస్‌ 24 గంటలు కరెంట్ ఇస్తే… ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 25 గంటలు కరెంట్ ఇస్తామని అంటారని, కాంగ్రెస్ ను ఏమి చూసి ఆదరించాలి ? అని ఆయన అన్నారు. హనుమంతుని గుడి లేని ఊరు లేదు… కేసీఅర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు తెలంగాణలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను పట్టుకుంటే కుక్క పట్టుకుని గోదావరి దాటినట్టే అని వెంకట్ రావు కు అర్థం అయ్యిందని ఆయన అన్నారు. కేసీఅర్ హయాంలో జల్… జంగల్.. జమీన్ లో ఏలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ లో వానాకాలం లో కోటి ఎకరాల సాగు జరుగుతోందని, కేసీఅర్ హయాంలో తెలంగాణ కోటి ఎకరాల మాగణి అయ్యింది తెలంగాణ అని ఆయన అన్నారు. ఛత్తీస్ గడ్ లో పొడు భూములకు పట్టాలు ఇచ్చారా ? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది.. కానీ ఆ పార్టీ నేతలు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ కు అరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదని ఆయన అన్నారు.

Also Read : Varun Tej : సెన్సార్ పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’..