Site icon NTV Telugu

Minister KTR : నూకలు తినమని చెప్పిన వాళ్ళ తోకలు కట్ చేయాలి

Minister Ktr

Minister Ktr

మునుగోడులో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. నిన్న అర్థరాత్రి వరకు నామినేషన్ల వేశారు అభ్యర్థులు. అయితే నేడు స్ర్కూట్‌నీ నిర్వహించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఇక మునుగోడులో ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయా పార్టీల నేతలు హామీలు కురుపిస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. అధికార టీఆర్‌ఎస్‌ తరుఫున ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా మంత్రి కేటీఆర్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు నిధులు ఇస్తే మునుగోడు పోటీ నుంచి తప్పుకుంటామని చెప్తే ప్రధానమంత్రి నుంచి స్పందన లేదని అన్నారు.

ఒక రాజగోపాల్ రెడ్డి ధనవంతుడు అయినంత మాత్రానా రైతుల ఆదాయం పెరగదని, రాజకీయాల్లో బొడ్డూడనోళ్లు, నిన్నా మొన్న వచ్చినోళ్లు కూడా నోటికి వచ్చినట్టు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దర్ని ధనవంతుల్ని చేస్తే దేశ సంపద పెరుగుతుందన్న భ్రమలో ప్రధానమంత్రి మోడీ ఉన్నాడని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడ్డగోలు మాటలు మాట్లాడిండని, నూకలు తినమని చెప్పిన వాళ్ళ తోకలు కట్ చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ల పార్టీకి నూకలు చెల్లేలా తీర్పులు ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.

Exit mobile version