Site icon NTV Telugu

KTR Comments: కాళేశ్వరాన్ని బద్నాం చేయొద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం

Ktr

Ktr

హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ అభివృద్దిపై మంత్రి కేటీఆర్‌ పర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కాళేశ్వరాన్ని బద్నాం చేయవద్దు.. బ్యారేజ్ లలో సమస్యలు రావడం సహజం అంటూ కేటీఆర్ వ్యాఖ్యనించారు. ఇప్పటి వరకు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ లలో కూడా సమస్యలు వచ్చాయి.. ప్రజలపై భారం లేకుండా.. మేడీగడ్డ బ్యారేజ్ సమస్య పరిష్కారం అవుతుంది.. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది.. మాకు అప్పులు పుట్టకుండా కూడా చేసింది అని ఆయన ఆరోపించారు. మరో ఏడాదిలో పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.. పట్వారీ వ్యవస్థ అంటే మళ్ళీ దళారీ వ్యవస్థను తీసుకుని రావడమే.. ధరణితో ప్రజల వేలి ముద్రకు అధికారం కేసీఅర్ ఇచ్చారు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: Bhagavanth Kesari: 24 గంటల్లో ఓటీటీలోకి సింహం దిగుతుంది…

తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మన సీఎం కేసీఆర్ దేనని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాట అయ్యాయని ఆయన తెలిపారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ గా నిలిచింది.. జీఎస్‌డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ.. పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్షా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి తెలిపారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు అని మంత్రి కేటీఆర్ కోరారు.

Exit mobile version