Site icon NTV Telugu

Minister KTR : తెలంగాణ చేనేత కళా నైపుణ్యాలకు ప్రతీక

Minister Ktr

Minister Ktr

నేడు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా రాజకీయ, అధికార యంత్రాంతం నేతన్నకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తాజాగా .. చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం జీఎస్టీ విధించడం చేనేత పరిశ్రమకు మరణ శాసనం రాసినట్లేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. చేనేత ఉత్పత్తుల మీద ఉన్న జీఎస్టీని కేంద్రం వెంటనే ఎత్తివేయాలి. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ చేనేత కళా నైపుణ్యాలకు ప్రతీకలు. మన చేనేత కార్మికుల శ్రమను గుర్తించండి.. చేనేతను కళాకారుల నైపుణ్యాలను గుర్తించండి చేనేత వస్త్రాలను కొనండి… చేనేతను ఆదరించండి. అంతరించిపోతున్న చేనేత కళలను ఆధునికీకరణ చేసి ప్రజలకు అందుబాటులో పెడుతున్నారు. దేశం గర్వించదగ్గ చేనేత వస్త్రాలు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామం. చేనేత మిత్ర ద్వారా 50 శాతం సబ్సిడీ ద్వారా ముడి సరుకు అందిస్తున్నాం. 96 కోట్లు క్రిప్ట్ పథకం ద్వారా లక్షలాది మంది కార్మికులకు కరోన సమయంలో సహాయం చేసాం. నేతన్నకు భీమా ద్వారా 80 వేల మంది కార్మికులకు లబ్ది చేకూరుతుంది. ప్రమాదవశాత్తు నేత కార్మికుడు చనిపోతే పది రోజుల్లో 5 లక్షల భీమా నామినికి అందిస్తాం. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేత కార్మికులకు మరిన్ని అవకాశాలు వస్తాయి.
చేనేత వస్త్రాలు ధరించడం వల్ల శరీర సౌందర్యం పెరగడంతో పాటు దేహానికి మంచి కలుగుతుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

 

Exit mobile version